జనవరి24 పీఆర్, ఆర్డీ ఉద్యోగుల ఆన్ లైన్ గ్రీవెన్స్ : మంత్రి సీతక్క

జనవరి24 పీఆర్, ఆర్డీ ఉద్యోగుల ఆన్ లైన్ గ్రీవెన్స్ : మంత్రి సీతక్క
  •  హాజరుకానున్న మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆ శాఖ మంత్రి సీతక్క కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారు తమ సమస్యలను హైదరాబాద్ లోని స్టేట్ ఆఫీస్ చుట్టు తిరగకుండా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యోగులు, సిబ్బందికి అర్జీలు సమర్పించుకునే సౌకర్యాన్ని కల్పించారు. 

సమయం వృథా కాకుండా, ప్రయాణ భారం లేకుండా ఉద్యోగుల సర్వీస్, ఇతర అంశాల పరిష్కారానికి చర్యలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా శుక్రవారం సెక్రటేరియెట్​లో ఆన్ లైన్ గ్రీవెన్స్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సీతక్కతో పాటు పీఆర్, ఆర్డీ కార్యదర్శి లోకేశ్ కుమార్, డైరెక్టర్ సృజన, ఇతర విభాగాల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ప్రతినెలా రెండో, నాలుగో శుక్రవారం ఉద్యోగులకు ఆన్ లైన్ గ్రీవెన్స్ నిర్వహించనున్నారు.