ఢిల్లీ చేరిన సీతక్క.. నేడు(ఫిబ్రవరి 3, 2025) కేంద్ర మంత్రి అన్నపూర్ణదేవితో భేటీ

ఢిల్లీ చేరిన సీతక్క.. నేడు(ఫిబ్రవరి 3, 2025) కేంద్ర మంత్రి అన్నపూర్ణదేవితో భేటీ

హైదరాబాద్, వెలుగు: పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర మహిళ, స్ర్తీశిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో సోమవారం ఆమె భేటీ కానున్నారు. అంగన్ వాడీలకు కేంద్ర వాటా నిధులు పెంచాలని అన్నపూర్ణాదేవిని సీతక్క కోరనున్నారు. తెలంగాణలో మహిళా శిశు సంక్షేమ శాఖ కింద అమలవుతున్న సంక్షేమ పథకాలపై నివేదించనున్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మరిన్ని పోషకాలతో కూడిన బలవర్దకమైన ఆహారాన్ని అందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. సీతక్క వెంట తెలంగాణ ఫుడ్స్  చైర్మన్  ఫయీమ్, ఉన్నతాధికారులు ఉన్నారు.