వయనాడ్​లో సీతక్క ప్రచారం

  • ప్రియాంకా గాంధీకి మద్దతుగా క్యాంపెయిన్ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మంత్రి సీతక్క మహారాష్ట్రలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ అభ్యర్థుల నామినేషన్​ప్రక్రియలో పాల్గొనడంతోపాటు వారి తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నాలుగు రోజులపాటు అక్కడే ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్​ పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై  పార్టీ నేతలతో చర్చించారు.

బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి దిశానిర్దేశం చేశారు.  శుక్రవారం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగించుకొని ఆమె కేరళకు వెళ్లారు.  వయనాడ్​ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీకి మద్దతుగా మంత్రి సీతక్క ప్రచారం చేయనున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు వయనాడ్ నియోజకవర్గంలో రెండు, మూడు రోజులపాటు  ప్రచారంలో  పాల్గొననున్నారు.