అగ్రి ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పండి: తుమ్మల

అగ్రి ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పండి: తుమ్మల
  • మలేషియా మంత్రిని కోరిన మినిస్టర్​ తుమ్మల నాగేశ్వరరావు​ 
  • ఆ దేశ పర్యటనలో పలు కంపెనీలను సందర్శించిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో అగ్రిప్రాసె సింగ్ యూనిట్స్ నెలకొల్పడానికి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని రాష్ట్ర మం త్రి తుమ్మల నాగేశ్వరరావు, మలేషియా వ్యవసా య మంత్రి మహ్మద్ బిన్ సాబును కోరారు. మలేషియా పర్యటనలో ఉన్న తుమ్మల శుక్రవారం మహ్మద్ బిన్ సాబుతో సమావేశమయ్యారు.   తమ ప్రభుత్వం వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, అగ్రిప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడానికి అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. తెలంగాణలో అగ్రిప్రాసెసింగ్ యూనిట్లతో పాటు పెట్టుబడులు పెట్టాలనికి తుమ్మల కోరారు. దీనికి బిన్ సాబు సానుకూలంగా స్పందించారు. 

ఫెల్డా చైర్మన్ అహ్మద్ షబేరీ చీక్రి ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమావేశమై ఆయిల్ పామ్ రంగంలో రైతులకు ప్రయోజనకరంగా ఉండే పద్ధతులపై చర్చించారు. తెనాషియా ప్రైవేట్ లిమిటెడ్  కంపెనీని సందర్శించి.. యాంత్రీకరణకు, వివిధ రకాల యంత్రాలు, పరికరాలు వాటి పనితీరును తెలుసుకున్నారు. వెర్టికల్ స్టెరిలైజర్, హారిజంటల్ స్టెరిలైజర్ వ్యత్యాసం తెలుసుకునేందుకు మలేషియా లో టానెర్​ అనే కంపెనీస్​ని సందర్శించారు. పదేండ్ల కింద వెర్టికల్ స్టెరిలైజర్​లో గెలలను ఉడకబెట్టే పద్ధతిలో ఉన్న సమస్యలు, అడ్డంకులను తొలగించి ప్రాసెసింగ్​లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అనుసరిస్తున్న కొత్త విధానాన్ని పరిశీలించారు. లేటెస్ట్​ టెక్నాలజీతో రెగ్యులేట్ స్పీడ్ తో మిల్ నడపడంతో తక్కువ లేబర్, తక్కువ ఖర్చు అవుతున్నట్లు గుర్తించారు. తర్వాత భారత హైకమిషన్ బీఎన్ రెడ్డితో తుమ్మల భేటీ అయ్యారు.