ఐదు టీఎంసీల నీరు విడుదల చేయండి

ఐదు టీఎంసీల నీరు విడుదల చేయండి
  • కర్ణాటక సీఎంను కోరిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు

గద్వాల, వెలుగు : తెలంగాణ రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలకు నారాయణపూర్‌‌ రిజర్వాయర్‌‌ నుంచి ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని మంత్రులు శ్రీధర్‌‌బాబు, జూపల్లి కృష్ణారావు కోరారు. బుధవారం ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌‌రెడ్డి, వాకిటి శ్రీహరి, మధుసూదన్‌‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌‌కుమార్‌‌తో కలిసి బెంగళూరు వెళ్లి కర్ణాటక సీఎం సిద్దిరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌ను కలిశారు. 

జూరాలలో 1.7 టీఎంసీల నీరే ఉండడం వల్ల తాగు, సాగు నీరు అందడం లేదన్నారు. ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాలో సుమారు 30 లక్షల మంది తాగునీటి కోసం జూరాలపైనే ఆధారపడి ఉన్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నారాయణపూర్‌‌ నుంచి ఐదు టీఎంసీలు విడుదల చేయాలని కోరారు. స్పందించిన కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎం నాలుగు టీఎంసీలు విడుదల చేసేందుకు హామీ ఇచ్చారని మంత్రులు చెప్పారు.