కేంద్ర మంత్రిని కలవనున్న తెలంగాణ మంత్రులు

ఢిల్లీ : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రగడ కొనసాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఇవాళ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కలవనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన హామీ కోరనున్నారు. నిన్న రాత్రి పీయూష్ గోయల్ తో ఎంపీ కే. కేశవరావు ఫోన్ లో మాట్లాడారు. అప్పాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు. రాజ్యసభ బిజినెస్ ఎక్కువగా ఉన్నందున కుదిరితే అపాయింట్ మెంట్ ఇస్తానని కేంద్ర మంత్రి చెప్పినట్లు సమాచారం. దీనిపై తెలంగాణ మంత్రులు, ఎంపీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో తమను వేచి ఉండేలా చేయడం తెలంగాణ రైతులను అవమానపరచడమేనని అన్నారు. తమకు అపాయింట్ మెంట్ ఇచ్చి రైతుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 
మరోవైపు వర్షాకాలంలో 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కన్నా అదనంగా పంట కొనుగోలు చేస్తామని కేంద్రం నుంచి లిఖితపూర్వక హామీ కావాలని తెలంగాణ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చిన పలు హామీల్లో చాలా వరకు అమలుకు నోచుకోలేదని అందుకు రాత పూర్వకంగా కోరుతున్నామని చెప్పారు. ఒకవేళ కేంద్రం సానుకూలంగా స్పందించని పక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

For more news

ఫిలిప్పీన్స్ లో 'రాయ్' బీభత్సం

పాండవుల వారసులట.. సోదరిని అత్తారింటికి పంపాలంటే..