
- ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ కమిషనర్
హైదరాబాద్, వెలుగు: మహా శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ర్టంలోని ప్రముఖ శివాలయాల్లో రాష్ర్ట ప్రభుత్వం తరుపున మంత్రులు పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. ఈ మేరకు సోమవారం దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
వేముల వాడలో మంత్రి పొన్నం ప్రభాకర్, కాళేశ్వరం టెంపుల్ లో మంత్రి శ్రీధర్ బాబు, రామప్ప టెంపుల్ లో మంత్రి సీతక్క, ఏడుపాయల టెంపుల్ లో మంత్రి దామోదర రాజనర్సింహ, మేల్లచెర్వు టెంపుల్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాలకుర్తి టెంపుల్ లో మంత్రి కొండా సురేఖ, నల్గొండ పానగల్ టెంపుల్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారని ఉత్తర్వుల్లో కమిషనర్ పేర్కొన్నారు.