ఆలయ అభివృద్ధికి సహకరించాలి : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

ఆలయ అభివృద్ధికి సహకరించాలి : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నందున  స్థానికులు సహకరించాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కోరారు. ఆర్డీవో దామోదర్​తో కలిసి శనివారం ఆలయ పరిసరాల్లో పర్యటించారు.  నిర్వాసితులు, దుకాణదారులతో చర్చలు జరిపారు. ప్రభుత్వం నిర్వాసితుల కోసం రూ.34 కోట్లు కేటాయించిందని, మెరుగైన ప్యాకేజీని ఇస్తుందని వివరించారు. 

కాగా, అద్దె ఇళ్లలో షాపులు నిర్వహిస్తున్న వారు తమ సమస్యలను ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. ఏళ్ల తరబడి షాపులపైనే ఆధారపడి జీవిస్తున్నామని, తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు.