తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గత పాలకులకు భిన్నంగా ప్రజల వద్దకే ప్రభుత్వం అనే విధంగా పారదర్శక పాలన అందిస్తామని ఎల్‌బి స్టేడియంనందు ప్రమాణం స్వీకారం సందర్భంగా సీఎం రేవంత్ ప్రజలకు హామీ ఇచ్చారు. వరుసగా తెలంగాణ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లోని ఎమ్మెల్యేల డైరెక్టరీ ప్రచురిస్తున్న నేను ఈసారి కూడా 'తెలంగాణ ఎమ్మెల్యేల డైరెక్టరీ-2023” ని ప్రచురించదలిచాను.
.ఇందులో మొత్తం 119 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్సీలు, ఎంపీల వివరాలు, చిరునామాలు, మెయిల్ ఐడిలు, ఫోన్ నెంబర్లతోపాటు సచివాలయ ఛాంబర్లు, ఉన్నతాధికారుల వివరాలు, ఇతర సమాచారం పొందుపరుస్తున్నాం. ఇదేవిధంగా ప్రజల సమస్యలతోపాటు జరగబోయే పాలన ఎలా ఉండాలి? గత పాలకులు ఎక్కడ వైఫల్యం చెందారు అనే విషయాలు కూడా ఈ డైరెక్టరీలో సమగ్రంగా వివరించబోతున్నాం.
ఇందులో భాగంగా ప్రజల నుంచి, మేధావుల నుంచి, ప్రజాసంఘాల నుంచి సలహాలను, అభిప్రాయలను ఆహ్వానిస్తున్నాం. ఇందులో బాగున్నవాటిని... మాకు నచ్చినవాటిని ఎంపిక చేసి ప్రచురించబోతున్నాం. చేతిరాత ద్వారా అయిదారు పేజీలు లేదా డీటీపీ ద్వారా నాలుగు పేజీలకు మించకుండా పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 25వ తేదీలోగా trnaidut@gmail.comకు మెయిల్ చేయాలని కోరుతున్నాం.
- తిప్పినేని రామదాసప్ప నాయుడు