ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఇయ్యాల్నే.. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాల్లో తేలనున్న ఫలితం

ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఇయ్యాల్నే.. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాల్లో తేలనున్న ఫలితం
  • కరీంనగర్, నల్గొండలో ఏర్పాట్లు పూర్తి 
  • మాక్ కౌంటింగ్ నిర్వహించిన అధికారులు
  • రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాల్లో తేలనున్న ఫలితం

కరీంనగర్/నల్గొండ, వెలుగు: ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గ స్థానాలతో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో.. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల కౌంటింగ్ నల్గొండలోని ఆర్జాల బావి గోదాంలో జరగనుంది.

సోమవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ముందుగా బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టనున్నారు. బండిల్స్ కట్టడమే మధ్యాహ్నం 12 గంటల వరకు అవుతుందని, అసలు కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం తర్వాతే మొదలుకానుందని అధికారులు తెలిపారు. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 35 టేబుళ్లు.. 
కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొత్తం 35 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో 21 టేబుళ్లు గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓట్ల కౌంటింగ్, 14 టేబుళ్లు టీచర్ ఓట్ల కౌంటింగ్ కోసం ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒక సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు విధులు నిర్వర్తించనున్నారు. వీళ్లందరికీ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడిటోరియంలో సంబంధిత అధికారులు ట్రెయినింగ్ ఇచ్చారు. మూడు షిప్టుల్లో సిబ్బంది కౌంటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొననున్నారు. ఇందుకోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్ సిబ్బందిని నియమించారు. అత్యంత పటిష్టమైన భద్రత సీసీ కెమెరాల నిఘా నడుమ కౌంటింగ్ జరగనుంది. 

ఎన్నికల అధికారులు ఆదివారం మాక్ కౌంటింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపులో పాల్గొనబోయే సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించేందుకు ఈ మాక్ కౌంటింగ్ ఉపయోగపడుతుందన్నారు. ఈ మాక్ కౌంటింగ్ ద్వారా ఎటువంటి పొరపాట్లకు, తప్పిదాలకు, ఆస్కారం లేకుండా కౌంటింగ్ సజావుగా సాగుతుందని అన్నారు. ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇచ్చిన ఆదేశాలను, సూచనలను కచ్చితంగా పాటించాలని అన్నారు. లెక్కింపు కేంద్రం ఆవరణలో మీడియా సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు.

భారీ బందోబస్తు.. 
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అంబేద్కర్ స్టేడియం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. విధులకు హాజరయ్యే కౌటింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు స్టేడియం లోని గేట్ నంబర్ -1 నుంచి లోపలికి రావాలని, అక్కడ నిర్దేశిం చిన ప్రాంతంలో వెహికల్స్ పార్క్​ చేసుకోవాలని ట్రాఫిక్ ఏసీపీ బి. యాదగిరి స్వామి సూచించారు. 

గేట్ నంబర్ 4 ద్వా రా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాలులోకి  అనుమతించనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ఏజెంట్లుగా వచ్చే వారికి కరీంనగర్ కలెక్టరేట్ గేట్ నంబర్ 2 ద్వారా అనుమతి ఉందని వెల్లడించారు. కాగా, నల్గొండలో కౌంటింగ్ కేంద్రం వద్ద 250 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు.

నల్గొండలో 25 టేబుళ్లు..
నల్గొండలో మొత్తం 25 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉండనున్నారు. కౌంటింగ్ కోసం మొత్తం 30 మంది సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 30 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మరో 250 మంది సిబ్బందిని స్ట్రాంగ్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను తీసుకురావడానికి నియమించారు.