నేటి నుంచి (ఫిబ్రవరి 3, 2025) ఎమ్మెల్సీ నామినేషన్లు

నేటి నుంచి (ఫిబ్రవరి 3, 2025) ఎమ్మెల్సీ నామినేషన్లు
  • కరీంనగర్, నల్గొండ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి 
  • రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు

కరీంనగర్/నల్గొండ, వెలుగు: ఈ నెల 27న ఎన్నికలు జరగనున్న రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కరీంనగర్–మెదక్– నిజామాబాద్–ఆదిలాబాద్- గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ సీట్లతో పాటు వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–-ఖమ్మం–నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేసింది. సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఇది ఈ నెల 10 వరకు కొనసాగుతుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ఉంటుంది. 27న ఉదయం 8 గంటల నుంచి సా యంత్రం 4 గంటల వరకు పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు, రిజల్ట్ ఉంటుంది. కాగా, నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

కరీంనగర్-–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్- గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ సీట్లకు కరీంనగర్ కలెక్టరేట్ లోనే నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 15 జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 271 మండలాలు ఉన్నాయి. 15 జిల్లాల పరిధిలో ఉన్న 199 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌--–ఖమ్మం–నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి నల్గొండ కలెక్టరేట్ లో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.

ఎక్కడెంత మంది ఓటర్లు? 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోబోయే ఓటర్ల తుది జాబితాను ఆఫీసర్లు సిద్ధం చేశారు. గతంతో పోలిస్తే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. 2019 ఎన్నికల్లో 1.96 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదు చేసుకోగా.. 2024 డిసెంబర్ 31 వరకు 3,41,313 మంది ఎన్ రోల్ చేసుకున్నారు. జనవరి 31 వరకు గడువు పొడిగించడంతో కొత్తగా  మరో 17,301 మంది నమోదు చేసుకున్నారు. దీంతో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్ల సంఖ్య 3,58,014కు చేరింది.

అలాగే నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కలిపి డిసెంబర్ 31 వరకు టీచర్ ఎమ్మెల్సీ ఓటు కోసం 25,921 మంది టీచర్లు ఎన్ రోల్  చేసుకున్నారు. మళ్లీ జనవరి 31 వరకు మరో 2,751 మంది నమోదు చేసుకోగా.. మొత్తం టీచర్ ఓటర్ల సంఖ్య  28,672కు చేరింది. ఇక వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–--ఖమ్మం–-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మొత్తం 24,905  మంది టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 

కరీంనగర్​లో క్యాంప్​ ఆఫీసులు.. 
ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో 24 రోజులే ఉండడంతో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ప్రచారం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆదివారం కరీంనగర్ లోని వావిలాలపల్లిలో క్యాంప్ ఆఫీసును ప్రారంభించారు. అదే క్యాంప్ ఆఫీస్ వేదికగా సిటీలోని కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. అలాగే బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య ఉమ్మడిగా కరీంనగర్ లోని విద్యానగర్ లో ఆదివారం  క్యాంప్ ఆఫీస్ ప్రారంభించారు.