![మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు](https://static.v6velugu.com/uploads/2021/05/Telangana-model-school-entrance-exam-application-deadline-extension_Hn0NRzlgKd.jpg)
తెలంగాణలో మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. జూన్ 20 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరో తరగతిలో ప్రవేశాలకు,7వ తరగతి నుంచి 10 వరకు ఖాళీగా ఉన్న సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆసక్తి గల విదార్థులు http ://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
దరఖాస్తు గడువు పొడిగించడంతో.. ప్రవేశ పరీక్ష నిర్వహణ తేదీలు కూడా మారనున్నాయి. పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని మోడల్ స్కూల్స్ ప్రాజెక్టు డైరెక్టర్ చెప్పారు. గతంలో జూన్ 5, 6 తేదీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు.