ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్​కు టీఎంఎస్టీఏ మద్దతు

ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్​కు టీఎంఎస్టీఏ మద్దతు

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్​కు  తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్​లో అభ్యర్థి పూల రవీందర్​ ను టీఎంఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, ప్రధాన కార్యదర్శి నగేశ్ తదితరులు కలిసి మద్దతు లేఖను అందించారు. 

ఈ సందర్భంగా పూల రవీందర్ మాట్లాడుతూ.. మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా జీతాలు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కారుణ్య నియామకాలు జరిగేలా సర్కారుపై ఒత్తిడి తీసుకొస్తానని చెప్పారు. టీచర్లందరికీ హెల్త్ కార్డులు ఇప్పిస్తానన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తననే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.