ఏప్రిల్ 13న మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్టు

 ఏప్రిల్ 13న మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్టు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 13న అడ్మిషన్ టెస్టు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్​ను ఈ నెల 23న రిలీజ్ కానున్నది. ఈ మేరకు శుక్రవారం మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి షెడ్యూల్ రిలీజ్ చేశారు. 6వ తరగతితో పాటు మిగిలిన క్లాసుల్లోని సీట్లకు జనవరి 6 నుంచి 28 వరకూ ఆన్​ లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.