![18న మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్](https://static.v6velugu.com/uploads/2019/04/model.jpeg)
హాజరుకానున్న లక్షా పది వేల మంది స్టూడెంట్స్
ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 409 ఎగ్జా మ్ సెంటర్స్
హైదరాబాద్, వెలుగు: మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం ఈ నెల18న అడ్మిష న్ టెస్ట్ నిర్వహించనున్నట్టు మోడల్ స్కూల్స్ డైరెక్టర్ ఏ.సత్యనారాయణరెడ్డి తెలిపారు. పరీక్షకు హాజరుకానున్న 1.10 లక్షల మంది విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 409 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఆరో తరగతిలో అడ్మిషన్ల కోసం 55 వేల మంది ఎగ్జామ్స్ రాస్తున్నారని, వారి కోసం 218 సెంటర్లు, ఏడు నుంచి పదో తరగతిలో చేరేందుకు పరీక్ష రాస్తున్న 55 లక్షల మందికి 191 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆరో తరగతిలో చేరే విద్యార్థు ల ప్రవేశ పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహం 12 వరకు, 7, 8 ,9, 10వ తరగతులకు ఎంట్రెన్స్ టెస్ట్‌ను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహిస్తామన్నారు. హాల్ టికెట్లు 10వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మోడల్ స్కూల్స్ వెబ్ సైట్ అందుబాటులో ఉంటాయన్నారు.