బీఆర్ఎస్ పార్టీకి సాయన్న లేని లోటు పూడ్చలేనిది : కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీకి సాయన్న లేని లోటు పూడ్చలేనిది : కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళులర్పించింది.  కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మాణం ప్రవేశపెట్టారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతాప తీర్మాణాన్ని బలపర్చారు. కంటోన్మెంట్ అభివృద్ధికి ఎంతో తపన పడ్డారని .. పార్టీకి ఆయన లేని లోటు పూడ్చలేనిదని సీఎం కేసీఆర్ అన్నారు.  కంటోన్మెంట్ ను జీహెచ్ ఎంసీలో  కలపాలని సాయన్న ఎంతో కృషి చేశారని సీఎం గుర్తుచేశారు.  సాయన్న కుటుంబానికి సీఎం కేసీఆర్, సభ సభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

ALSO READ:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే

మూడు, నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున .. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. ముందస్తు ఎన్నికల సభ కావడంతో అధికార, ప్రతిపక్షాలు తమ గళం వినిపించేందుకు సిద్ధమయ్యాయి. ఈ సమావేశాల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అలాగే మరికొన్ని ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం చర్చించి బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి,  ఇప్పటివరకు ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు, పథకాల గురించి సూత్రప్రాయంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.