ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మిస్టర్​ సింగరేణిగా శ్రీనివాస్​రెడ్డి

నస్పూర్​/మందమర్రి,వెలుగు: శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి ప్రగతి స్టేడియంలోని సీఈఆర్  క్లబ్ లో  రెండు రోజుల పాటు నిర్వహించిన సింగరేణి స్థాయి బాడీ బిల్డింగ్, వెయిట్, పవర్ లిఫ్టింగ్ పోటీలు బుధవారం ముగిశాయి. ఫైనల్ పోటీల్లో భూపాలపల్లి ఏరియాకు చెందిన కోల్​కట్టర్  శ్రీనివాస్​రెడ్డి మిస్టర్​సింగరేణి టైటిల్​ కైవసం చేసుకున్నాడు.  బెస్ట్​లిఫ్టర్ ఆఫ్ సింగరేణిగా మణుగూరు ఏరియాకు చెందిన జనరల్​మజ్దూర్​ కె.అనిల్​కుమార్, స్ర్టాంగ్​ఉమెన్​ఆఫ్​ సింగరేణిగా భూపాలపల్లి ఏరియా స్టాఫ్​నర్స్ పి.శ్వేత, స్ర్టాంగ్​మెన్​ఆఫ్​ సింగరేణిగా రామగుండం-2 ఏరియా సెక్యూరిటీ గార్డు కె.ఆనందరావు నిలిచారు. రెండు రోజుల పాటు నిర్వహించి పోటీల్లో 11 ఏరియాకు చెందిన  సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో భూపాలపల్లి ఏరియా క్రీడాకారులు అత్యధికంగా  ఏడు గోల్డ్​మెడల్స్ సాధించారు. శ్రీరాంపూర్ ఏరియా  5, మణుగూరు 4, ఆర్జీ-2 ఏరియా 4, ఆర్జీ-1 ఏరియా 3, కార్పొరేట్ 3, ఆర్జీ-3 ఏరియా 2, మందమర్రి ఏరియాకు ఒక  గోల్డ్​మెడల్​దక్కింది.​ ఐదు సిల్వర్ మెడల్స్​భూపాలపల్లి ఏరియా క్రీడాకారులు దక్కించకోగా, మణుగూరు ఏరియాకు 6 ​, ఆర్జీ-1 ఏరియాకు 4, ఆర్జీ-2 ఏరియాకు 4, శ్రీరాంపూర్ ఏరియా​ 3, మందమర్రి 3 , ఆర్జీ-3 ఏరియాకు 2 చొప్పున సిల్వర్ మెడల్స్ దక్కాయి. క్రీడాకారులకు శ్రీరాంపూర్​ ఏరియా సింగరేణి జీఎం బి.సంజీవరెడ్డి  బహుమతులు అందజేశారు. టీబీజీకేఎస్​ వైస్​ ప్రెసిడెంట్​ కేతిరెడ్డి సురేందర్​రెడ్డి, ఎస్​వోటు జీఎం త్యాగరాజు, సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్ బాధ్యులు దేవేందర్​రెడ్డి, అధికార స్పోక్స్​పర్సన్, డీజీఎం పర్సనల్ పి.గోవిందరాజు, క్రీడల సెక్రటరీ పాలకుర్తి రాజు, సీనియర్​ పీవో కాంతారావు, సింగరేణి స్పోర్ట్స్​ సూపర్​వైజర్లు సుందరాజు, జాన్​వెస్లీ, చాట్ల అశోక్, పర్స శ్రీనివాస్, హెచ్. రమేశ్,  శ్రీరాంపూర్​ ఏరియా డబ్ల్యూపీఎస్​అండ్​జీఏ కోఆర్డినేటర్ తోట​సురేశ్, ఆర్.గోపాల్​ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

నిర్మల్, వెలుగు: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ లీడర్లు డిమాండ్​చేశారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్, ప్రధాన కార్యదర్శి భూమయ్య ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నిరసనకు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, విద్యార్థి సంఘాల బాధ్యులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రాంనాథ్, అప్పాల గణేశ్ చక్రవర్తి, కాంగ్రెస్ లీడర్లు నాందేడపు చిన్ను, ఎండీ అజార్, ఇమ్రాన్ ఉల్లా, బహుజన సమాజ్ పార్టీ లీడర్లు జగన్మోహన్, రంజిత్, సుదర్శన్, శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు. అర్హులకు అక్రెడిటేషన్, ఇంటి స్థలాల కేటాయింపు, డబుల్ బెడ్  రూమ్ ఇండ్ల మంజూరు కాలేదన్నారు. అనంతరం టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రవీందర్  మాట్లాడుతూ  ప్రతీ జర్నలిస్టుకు అక్రెడిటేషన్​ మంజూరు చేయాలన్నారు. ధర్నాలో యూనియన్ లీడర్లు, బీజేపీ నాయకుడు రాచకొండ సాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేశ్, జావిద్ అహ్మద్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్, రంజిత్, రాజన్న, లక్ష్మి, టీజేఏ అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్, శ్రీనివాస్, పీడీఎస్ యూ  జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్, బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ పోశెట్టి 
పాల్గొన్నారు.

రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోంది

ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆరోపించారు. బుధవారం పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తూ గ్రామపంచాయతీల ఖాతాల్లో జమచేస్తే, సర్పంచ్ ఉపసర్పంచ్ సంతకాలు లేకుండా ప్రభుత్వం దొంగదారిన నిధులు విత్ డ్రా చేయడం సిగ్గు చేటన్నారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులే రాజీనామా చేస్తున్నారంటే ఆ పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. కాజేసిన డబ్బులు ప్రభుత్వం 48 గంటల్లో పంచాయతీల ఖాతాల్లో జమచేయకుంటే హైకోర్టులో 420 కేసు పెడుతామని హెచ్చరించారు. అనంతరం చించు ఘాట్ గ్రామానికి చెందిన స్కూల్ సొసైటీ చైర్మన్ ఆత్రం భీమ్ రావు బీజేపీలో చేరగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశంలో లీడర్లు అంకత్ రమేశ్, జోగు రవి, దినేశ్​ మాటోలియ, జంగారెడ్డి, విలాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, ముకుంద్ రావు, భీమ్​సేన్​రెడ్డి, దయాకర్, రత్నాకర్ రెడ్డి  కార్యకర్తలు ఉన్నారు.

బీజేపీని అధికారంలోకి తీసుకురావాలె

మందమర్రి,వెలుగు: బీజేపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​ వెరబెల్లి కోరారు. బుధవారం పార్టీ ఆఫీస్​లో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేశ్, టౌన్ ప్రెసిడెంట్ సప్పిడి నరేశ్​, సీనియర్​ లీడర్లు దీక్షితులు, దుర్గారాజు, వైస్  ప్రెసిడెంట్లు సమ్మయ్య, ఓదెలు, సురేందర్ పాల్గొన్నారు.

బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి రావొద్దు


కాగజ్ నగర్,వెలుగు: బీఆర్ఎస్ ప్రజల కోసం పనిచేస్తోందని, లీడర్ల జోలికి ఎవరు వచ్చినా ఊరుకోమని ఆ పార్టీ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. బుధవారం దహెగాం, పెంచికల్ పేట మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. 

నాణ్యమైన విద్య అందిస్తున్నాం

ఆసిఫాబాద్,వెలుగు: ‘మన ఊరు.. మన బడి’ ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని  ఈడబ్ల్యూసీ చైర్మన్ రావుల శ్రీధర్ చెప్పారు. బుధవారం  కలెక్టరేట్​లో కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్​పేయ్ తో కలిసి వివిధ శాఖల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. మారుమూల గ్రామాల్లోని స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించేలా ఆఫీసర్లు చూడాలన్నారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన వివిధ పనులు త్వరతిత గతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వాంకిడి మండలం బెండార  స్కూల్ ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

భైంసా,వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ లీడర్​ పవార్ రామారావు పటేల్ కార్యకర్తలకు సూచించారు. బుధవారం తానూర్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్​సర్కార్​ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురాలని కోరారు. గత ఎన్నికల్లో కేసీఆర్ రైతులకు 24 గంటల పాటు ఫ్రీ కరెంట్​ఇస్తానని చెప్పి 8 గంటలు కూడా ఇవ్వడంలేదని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విఫలమయ్యారన్నారు. కాళేశ్వరం కాల్వ ద్వారా తానూర్​ రైతుల కాళ్లు కడుగుతామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తర్వాతే బీఆర్ఎస్​ లీడర్లు ఓటు అడగాలన్నారు. కుంటాల ఎంపీపీ గజ్జరాం, సీనియర్​లీడర్లు రవి పాండే, గోపాల్ సార్డా, బాజనోల్ల గంగాధర్, అనిల్, తూము దత్తు, నాగేశ్వర్​రావు, సాయినాథ్, సోమేశ్, శివాజీ పటేల్, లింగురాం తదితరులు పాల్గొన్నారు.

9 నుంచి నిర్మల్​లో రాష్ట్రస్థాయి సైన్స్​ఫెయిర్​

నిర్మల్,వెలుగు: రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలు నిర్మల్​లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్సీఈ ఆర్టీ ఆఫీసర్లు ఉత్తర్వులు జారీచేశారు. వచ్చేనెల 9 నుంచి11 వరకు స్థానిక సెయింట్ థామస్ స్కూల్లో పోటీలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. బుధవారం డీఈవో రవీందర్ రెడ్డి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ల ను  కలిసి రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్​పోటీలకు రావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నరేంద్రబాబు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గజేందర్ తదితరులు ఉన్నారు.