తెలంగాణ ఉద్యమం మొదట పాల్వంచలో ప్రారంభమైంది.
1960లో కొత్తగూడెంలో నిర్మించిన పవర్‌స్టేషన్‌లో 1400 మందికి ఉద్యోగాలు లభిస్తే అందులో తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కేవలం 200 మంది ఉన్నారు.
కొత్తగూడెం పవర్‌స్టేషన్‌లో 1960లో ఉద్యోగాలు సంపాదించిన 200 మంది తెలంగాణ ప్రాంతీయుల్లో 175మందిని 1968లో తొలగించారు.
తెలంగాణలో ముల్కీ నియమాలను అమలు చేసి స్థానికులకు ఉద్యోగాలివ్వాలని హైదరాబాద్‌లో నాన్ గెజిటెడ్ ఉద్యోగులు 1968 నవంబర్‌లో ఆందోళన చేశారు.
తెలంగాణ రక్షణల అమలుకు ఉద్యమం చేయాలని నిర్ణయించుకుని, ఇందుకు మద్దతు కూడగట్టడానికి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించిన బృందంలో కె.రామసుధాకర్ రాజు కీలక సభ్యుడు.
1968 నవంబర్‌లో ముల్కీ నియమాల గురించి జరిగిన చర్చ సందర్భంగా ముల్కీ నియమాలకు విరుద్ధంగా వచ్చిన ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను వెనక్కి పంపి ఆ స్థానాల్లో తెలంగాణ వారిని నియమించాలని గౌతు లచ్చన్న సూచించారు.
గౌతు లచ్చన్న సూచనలు అమలు కాకపోవడానికి కారకులు ఎం.టి.రాజు.
తెలంగాణకు జరిగిన అన్యాయాలను రూపుమాపాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై 1968లో తెలంగాణ రీజినల్ కమిటీ చైర్మన్ చొక్కారావు ఒత్తిడి తెచ్చారు.
కార్పొరేషన్లలోను, స్వయం ప్రతిపత్తిగల సంస్థల్లో స్థానిక రిజర్వేషన్లు వర్తించవని హైకోర్టు 1969 జనవరి 3న తీర్పునిచ్చింది.
ఉస్మానియా యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి విషయంలో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.ఎస్.రెడ్డికి మధ్య వివాదం తలెత్తింది.
ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను తొలగించి ఆయన స్థానంలో పిన్నమనేని నరసింహారావును నియమించారు.
తెలంగాణ రక్షణల ఉద్యమాన్ని ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన అనుకూల విద్యార్థి నాయకుల నేతృత్వంలో నడిపించాలనుకున్నారు. ముఖ్యమంత్రి అనుకూల వర్గానికి వెంకట్రాంరెడ్డి నేతృత్వం వహించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి వ్యతిరేక వర్గానికి విద్యార్థి నాయకుడు వి.మల్లికార్జున్ నేతృత్వం వహించాడు.
తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ 1968 ఫిబ్రవరి 18న ఏర్పడింది.
తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ సంస్థ కన్వీనర్ ఎ.మదన్మోహన్.
పీపుల్స్ కన్వెన్షన్ ప్రథమ సభలు మార్చి 8, 9వ తేదీల్లో రెడ్డి హాస్టల్ ప్రాంగణంలో జరిగాయి.
పీపుల్స్ కన్వెన్షన్ ప్రథమ సభలకు సదాలక్ష్మి అధ్యక్షత వహించారు.
పీపుల్స్ కన్వెన్షన్ ప్రథమ సభల సందర్భంగా జరిగిన సదస్సును రావాడ సత్యనారాయణ ప్రారంభించారు.
తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ పేరు తెలంగాణ ప్రజా సమితిగా మారింది.
తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్, తెలంగాణ ప్రజా సమితిగా 1969 మార్చి 25న మారింది.
తెలంగాణ ప్రజాసమితి తొలి అధ్యక్షులు మదన్మోహన్.
తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షునిగా మర్రి చెన్నారెడ్డి 1969 మే 22న పదవీ స్వీకారం చేశారు.
తెలంగాణ స్వాతంత్ర్య ప్రతిపత్తి గల ప్రాంతంగా రూపొందించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ సూచించారు.
మంత్రిగా ఉంటే తన అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉండదని భావించి తన పదవిని వదులుకున్న ప్రముఖుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.
1969 మార్చి 3న బంద్ సందర్భంగా శాసనసభలకు హాజరు కాకూడదని ఉద్యమకారులు పిలుపునిచ్చినప్పుడు టి.పురుషోత్తమరావు, జి.వి.సుధాకర్‌రావు స్పందించారు.
1969 ఏప్రిల్‌లో అడ్వకేట్స్ ఫోరం ఏర్పడింది.
1969 జూన్ 1న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఏర్పడింది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కొండా లక్ష్మణ్ బాపూజీ అధ్యక్షతన ఏర్పాటైంది.