స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం నడించిందన్నారు సీఎం కేసీఆర్. అహింసమార్గంలోనే స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. గోల్కొండ కోటలో జాతీయ జెండాను అవిష్కరించారు కేసీఆర్. అనంతరం మాట్లాడిన కేసీఆర్.. గత పాలకుల చేతిలో చితికిపోయిన తెలంగాణ ఇప్పుడు.. అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది. దేశం అనుసరిస్తుంది అన్నట్టుగా రాష్ట్రంలో అభివృద్థి జరుగుతుందని చెప్పారు. ప్రజల ఆశయాలకు, అవసరాలకు అనుగుణంగా బీఆర్ఎస్ పాలన సాగుతోందని చెప్పారు. రాష్ట్రం ఏర్పాడ్డాక ప్రజల కష్టాలు తొలిగించామని కేసీఆర్ చెప్పారు. ఒకప్పుడు నీటి చుక్క కోసం అలమటించిన తెలంగాణలో ఇప్పుడు జలధారాలు పారుతున్నాయన్నారు.
తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు కేసీఆర్. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రెండు దశల్లో రాష్ట్రంలోని రైతులకు దాదాపు 37 వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసిందని తెలిపారు. దేశం మొత్తం మీద రైతులను ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదని తాను సగర్వంగా ప్రకటిస్తున్నానమన్నారు. . రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదని స్పష్టం చేశారు.
సంపద పెంచు - ప్రజలకు పంచు అనే సదాశయంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గుతుందని, తలసరి ఆదాయం పెరుగుతున్నదని అన్నారు కేసీఆర్. జాతీయ స్థాయిలో నమోదయిన సగటు పేదరికంతో పోల్చిచూస్తే తెలంగాణలో పేదరికం అందులో మూడోవంతుగా నమోదైందని చెప్పారు. ఈ నివేదిక ప్రకారం 2015-16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చిందని . అంటే, ఏకంగా 7.3 శాతం పేదరికం కనుమరుగైందని కేసీఆర్ తెలిపారు.