మా తెలుగువాళ్లు చాలా స్మార్ట్.. బాలీవుడ్ దుమ్మురేపుతారు.. మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ వైరల్

బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్(Ranbir Kapoor), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) కలిసి నటించిన మూవీ యానిమల్(Animal). సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. టీజర్, ట్రైలర్ తో మరింత అంచనాలను క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచేశారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా యానిమల్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు యానిమల్ చిత్ర యూనిట్ తో పాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ ఈవెంట్ లో మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు.. ఈ రోజు మన మల్లారెడ్డి యూనివర్సిటీకి యానిమల్ మూవీ టీమ్ వచ్చారు. మహేష్ బాబు గారు.. మీ బిజినెస్ మెన్ సినిమా చూసి పదిసార్లు చూశాను. ఆ సినిమా చూసే నేను రాజకీయాల్లోకి వచ్చాను.. ఎంపీ అయ్యాను. అదే మోడల్.. అదే సిస్టమ్. రణ్బీర్ కపూర్ మీకొక విషయం చెప్తాను. నేను చాలాకాలం క్రితమే చెప్పాను.. మా తెలుగోళ్లు చాలా స్మార్ట్.. బాలీవుడ్, హాలీవుడ్‌ను రూల్ చేస్తారని. అలా వచ్చినవాళ్లే రాజమౌళి, దిల్ రాజు, సందీప్ రెడ్డి వంగా. పుష్ప మూవీతో అల్లు అర్జున్ బాలీవుడ్ లో దుమ్మురేపాడు.. ఇప్పుడు సందీప్ మళ్ళీ దుమ్మురేపుతాడు. మా మల్లారెడ్డి యూనివర్సిటీ లో ఇప్పటివరకూ నాలుగు సార్లు అశ్వమేధ యాగం జరిగింది. ఇలాంటి చోటు నుండి ఏ సినిమా రిలీజైనా ఈజీగా రూ.500 కోట్లు కలెక్షన్స్ వస్తాయి. అలాగే యానిమల్ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది.. అంటూ చెప్పుకొచ్చాడు మల్లారెడ్డి. ప్రస్తుతం మల్లారెడ్డి మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.