
- సెకండ్ ప్లేస్లో చేవెళ్ల ఎంపీ కొండా
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటు వర్గాలు సభ్యుల హాజరు శాతాన్ని బుధవారం విడుదల చేశాయి. తెలంగాణ నుంచి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 100% హాజరుతో మొదటి స్థానంలో నిలిచారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 95% హాజరుతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై మొత్తంగా చామల 79 ప్రశ్నలను అడిగారు.
ఇందులో ఐటీఐఆర్, తెలంగాణ అప్పుల రీస్ట్రక్చర్, హైదరాబాద్ నుంచి రాయగిరి (యాదగిరిగుట్ట) వరకు ఎంఎంటీఎస్ విస్తరణ, పోచంపల్లి చేనేత కార్మికుల ఇక్కత్ సమస్యలు, కొత్త రైల్వే లైన్లు, ట్రైన్ హాల్టింగ్ లు ఇతర కీలక అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. లోక్ సభలో జరిగిన 17 అంశాల్లో డిబేట్లో పాల్గొన్నారు.