సిద్దిపేట రూరల్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు లో నాలుగు రోజుల పాటు జరిగిన ఇంటర్నేషనల్ సౌత్ ఏషియన్ పీస్ కాన్ఫరెన్స్ లో సిద్ధిపేట పట్టణానికి చెందిన మూర్తి శ్రీహితా రెడ్డి పాల్గొన్నారు. ఈమె నిజాం కాలేజ్ లో ఎంఏ ఇంగ్గిష్ చదివారు. భూటాన్, నేపాల్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొనగా.. శ్రీహిత తెలంగాణ నుంచి పాల్గొని ప్రసంగించారు.
ఆమెతో పాటు రాష్ట్రం తరపున 19 మంది యువతీ, యువకులు కలిసి తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలను, కళా నైపుణ్యాలను ప్రదర్శించారు. తెలంగాణ బృందాన్ని నేషనల్ యూత్ ప్రాజెక్ట్ సౌత్ రీజినల్ కోఆర్డినేటర్ కన్నె యాదవ రాజు ప్రసంశించారు.