Telangana NEET UG Counselling 2023: నీట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్కు రేపే లాస్ట్ డేట్

కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS), తెలంగాణ నీట్ UG 2023 కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్లకు గడువు జూలై 14తో ముగియనుంది.  తెలంగాణ NEET UG కౌన్సెలింగ్ 2023కి హాజరు కావాలనుకునే అభ్యర్థులు KNR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ యొక్క  వెబ్‌సైట్‌ ను లాగిన్ అయి అప్లై చేసుకోవచ్చు tsmedadm.tsche.inలో సైన్సెస్.

దరఖాస్తు ప్రక్రియ జూలై 14 సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది.  తెలంగాణ రాష్ట్ర NEET UG కౌన్సెలింగ్ , ప్రైవేట్ అన్-ఎయిడెడ్ నాన్-మైనారిటీ,  మైనారిటీ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ అన్-ఎయిడెడ్‌లలో 15 శాతం స్టేట్ కోటా సీట్ల కోసం జరుగుతోంది.

కటాఫ్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ మార్కులను సాధించడం ద్వారా NEET- UG -2023లో అర్హత సాధించిన అభ్యర్థులు కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల కోసం స్టేట్ మెరిట్ పొజిషన్‌ను నిర్ణయించడానికి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ) / బయోటెక్నాలజీ, ఇంగ్లీషుతో ఇంటర్మీడియట్ లేదా దానికి ఈక్వల్ గా ఉండే ఎగ్జామ్ లో  పాసై ఉండాలి.

తెలంగాణ నీట్ UG కౌన్సెలింగ్ 2023 రిజిస్ట్రేషన్ ఫీజు

ఓపెన్ కేటగిరీ (OC) , వెనుకబడిన తరగతి (BC) అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు,ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 3,500 చెల్లించవలసి ఉంటుంది. అయితే, షెడ్యూల్డ్ కులాల (SC) మరియు షెడ్యూల్డ్ తెగల (ST) అభ్యర్థులు రూ. 2,900 చెల్లించాలి. ఫీజులను డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.