ముహూర్తం బాగుంది : 7న కొత్త ప్రభుత్వం ఏర్పాటు

ముహూర్తం బాగుంది : 7న కొత్త ప్రభుత్వం ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయ్యింది. సీఎం ఎవరు అనేది కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసేసింది. అయితే డిసెంబర్ 5వ తేదీ రాత్రి.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. డీకే శివకుమార్ తోపాటు ఢిల్లీ వెళ్లిన ఏఐసీసీ ప్రతినిధులు.. హైదరాబాద్ వచ్చిన తర్వాత.. సీఎం ఎవరు అనేది వెల్లడించనున్నారు. రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం ఉందనేది బయటకు వార్తలు వస్తున్నా.. అధికారికంగా ప్రకటించకపోవటంతో ఉత్కంఠ నెలకొంది. సీఎం అభ్యర్థిని హైకమాండ్ డిసైడ్ చేసిన క్రమంలో.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపైనా చర్చ నడుస్తుంది.

డిసెంబర్ 6వ తేదీ మంచి ముహూర్తం లేకపోవటంతో.. డిసెంబర్ 7వ తేదీ గురువారం, దశమి మంచి రోజు కావటంతో.. ఆ రోజునే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజునే సీఎంతోపాటు డిప్యూటీ సీఎం, మరికొంత మంది సీనియర్ నేతలు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు లేకపోలేదు. ప్రమాణ స్వీకారం తేదీ అయితే కన్ఫామ్ అయ్యింది.. సీఎం అభ్యర్థి ఎవరు అనేది విషయంలో ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది.