తెలంగాణలో కొనసాగుతున్న కరోనా కలకలం

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా కలకలం

తెలంగాణలో కరోనా వైరస్ కలకలం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇవాళ 40,414 మందికి టెస్టులు చేయగా.. 3,877 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,189 మందికి కరోనా సోకిందని, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 348 మంది, రంగారెడ్డి జిల్లాలో 241 మంది, హనుమకొండ జిల్లాలో 140 మంది వైరస్ బారినపడ్డారని పేర్కొంది.

ఇవాళ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో ఇద్దరు మరణించారని, 2,981 మంది పూర్తిగా కోలుకున్నారని ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 7 లక్షల 54 వేల 976కు చేరిందని తెలిపింది. ఇందులో ఏడు లక్షల 10 వేల 479 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారని, ప్రస్తుతం 40,414 మంది ఇంకా చికిత్స పొందుతున్నారని పేర్కొంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.11 శాతంగా ఉందని, మరణాల రేటు 0.54 శాతమని తెలిపింది.

మరిన్ని వార్తల కోసం..

రెండు రాష్ట్రాలకు అప్పుల లిమిట్ పెంచిన కేంద్రం

బ్రహ్మోస్‌ మిస్సైల్ ఎగుమతికి భారత్‌కు తొలి ఆర్డర్

ఎన్సీసీ పరేడ్‌లో ప్రధాని మోడీ న్యూ లుక్