యాదాద్రి భువనగిరి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు తెలంగాణ కొత్త గవర్నర్ సీపీ రాధాకృష్ణన్. బుధవారం (మార్చి20) తెలంగాణ గర్నవర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిసారి ఆలయానికి వచ్చిన గవర్నర్ కు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు సీఎస్ శాంతకుమారి,ఈవో భాస్కర్రావు. వేదాశీర్వాదాలు అందించారు ఆలయ అర్చకులు. అనంతరం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు స్వామివారి ప్రసాదం అంద జేశారు.
మంగళవారం (మార్చి 19)తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందర రాజన్ రాజీనామా చేశారు. అనంతరం ఆమె తమళనాడు బీజేపీలో చేరారు. ఆమె లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో తెలంగాణ కొత్త గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..బుధవారం (మార్చి20) ఉదయం 11.15 గంటలకు రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో తెలంగాణ గవర్నర్ గా రాధాకృష్ణన్ చేత ప్రమాణ చేయించారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. సీసీ రాధాకృష్ణన్ కు తెలంగాణతోపాటుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గానూ బాధ్యతలు అప్పగించారు.