తెలంగాణ నెక్ట్స్​ సీఎం బీసీ వ్యక్తే : ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న

తెలంగాణ నెక్ట్స్​ సీఎం బీసీ వ్యక్తే : ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న

బీసీల రిజర్వేషన్​ కు సంబంధించి బీజేపీ.. బీఆర్ఎస్​ లు ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న డిమాండ్​ చేశారు.   బీసీలకు 42 శాతం కల్పించేందుకు మేమంత.. మాకెంత.. అనే నినాదంతో బీసీ లు ముందుకు రావాలన్నారు. 2028 లో బీసీ కి చెందిన వారే తెలంగాణ  ముఖ్యమంత్రి అవుతారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్​ విషయంలో ఇంకా గైడ్​ లైన్స్​ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు.  నా రాజీనామాకు కొంతమంది డిమాండ్​ చేస్తున్నారని.. మండలిలో బీసీల సమస్యల గురించి ఎవరు  ప్రస్తావిస్తారని మల్లన్న అన్నారు.  రాహుల్​ గాంధీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని..ఆయన అవమానపడేలా ఎప్పుడు ప్రవర్తించనన్నారు.

ALSO READ | MLA రాజాసింగ్ హత్యకు కుట్ర! పోలీసులు కస్టడీలో ఇద్దరు అనుమానితులు

 పోటీ పరీక్షల్లో బీసీలకు 250 మార్కుల వచ్చినా ఉద్యోగం రావడంలేదని.. బీసీలకు ఇల్లు, ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. Ews లో 10 శాతం లో వర్గీకరణ ఉన్నా.. ఇందులో పేద వాళ్ల కు అవకాశం రావడంలేదన్నారు.  లక్షా 50 వేల మంది ఉన్న వెలమ కులస్తుల్లో 14 మంది  ఎమ్మెల్యేలు ఉన్నారంటూ..  బీసీ ఉద్యోగులు  బీసీ మీటింగ్ కు రావాలంటే భయపడుతున్నారని తెలిపారు.  స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి..  ఉమ్మడి రాష్ట్రం లో.. తెలంగాణ ను పరిపాలించింది అగ్ర కులాలవారేనన్నారు.తెలంగాణ లో అగ్ర వర్ణాల పరిపాలన ఆగిపోవాలి. కల్వకుర్తిలో జరిగిన వైశ్యుల మీటింగ్ లో బీసీల ఉద్యమానికి మద్దతు పలికారు.  బీసీ ల రిజర్వేషన్లు అంటే పాలకులు కు ఇబ్బంది అవుతుంది.

విద్యాశాఖలో బీసీ టీచర్లను పరిశీలిస్తే  లెక్కలు, సైన్సు చెప్పే అగ్ర కులాలు హెడ్మాస్టర్ లు అవుతున్నారని..   తీన్మార్ మల్లన్న కు రెడ్డి ల ఓట్లు వద్దు బీసీ ల ఓట్లు చాలన్నారు. తెలంగాణ లో బీసీ లు అంత ఒకటి అయ్యామంటూ..  తెలంగాణ లో బీసీ ఉద్యోగి కి అన్యాయం జరిగితే ఊరుకోమన్నారు. కొంతమంది తనపై సీఎం రేవంత్​ రెడ్డికి ఫిర్యాదు చేస్తే .. ప్రభుత్వం బీసీల అభివృద్దికి కట్టుబడి ఉందని వారికి చెప్పారని.. ఎమ్మెల్సీ మల్లన్న అన్నారు.ఫామ్​ హౌస్​లో కూర్చుని బీసీ ఉద్యమం అంటున్న కేసీఆర్​ ... ఆయన హయాంలో బీసీలను ఎందుకు పక్కన కూర్చోపెట్టుకోలేదని ప్రశ్నించారు.