- క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తోంది.
కోవిడ్ మొదటి డోస్ వ్యాక్సినేషన్లో దేశంలోనే తెలంగాణ నంబర్వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా లక్డీకాపూల్లోని ప్రభుత్వ ఎమ్ఎన్జె క్యాన్సర్ ఆసుపత్రిలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్, సిటీ స్కాన్, 100 పడకల సత్రాన్ని మంత్రి హరీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తతో వ్యవహరించిందని, మొదటి డోస్ వ్యాక్సినేషన్ని చాలా వేగంగా పూర్తి చేశామని తెలిపారు. ఇప్పుడు రెండు, మూడో డోస్ వ్యాక్సినేషన్ కూడా స్పీడ్గా అవుతోందన్నారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తిస్తే ఈజీగా నయం చేయొచ్చు అన్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆరోగ్య శ్రీ ద్వారా ఏడాదికి ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. త్వరలోనే ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ వివరాలు సేకరిస్తామన్నారు మంత్రి హరీష్ రావు.
ఇవి కూడా చదవండి..
సొంత బిడ్డను ఎలుగుబంటిపైకి విసిరేసింది
దొడ్డి కొమురయ్య బయోపిక్ షూటింగ్ ప్రారంభం