
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరమని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం సిటీలో ఆమె తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న అగ్ని మాపక వారోత్సవాల పోస్టర్స్‌ను ఆవిష్కరించారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రచారం చేస్తూ చైతన్యపర్చడానికి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బల్దియా మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు ప్రవీణ్ కుమార్, భోగి సువర్ణ, దిడ్డి కుమారస్వామి, డీఎఫ్ వో కేవీ సతీశ్ కుమార్, ఎస్ఎఫ్ వో రాజేశ్వర్ రావు, జమేధార్ మాధవ రెడ్డి, వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్, సీఐలు తదితరులు పాల్గొన్నారు.