బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణ పద్మశాలి మహిళా సంఘం విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను నారాయణగూడలోని పద్మశాలి భవన్ లో శుక్రవారం ఆవిష్కరించారు.
ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఎల్.రమణ, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్రి అనిల్, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, రాష్ట్ర అధ్యక్షుడు కవర్త మురళి, మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటుక రూప సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.