గల్ఫ్ మృతుల కుటుంబాలకురూ. 3.3 కోట్ల ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేషియా

గల్ఫ్ మృతుల కుటుంబాలకురూ. 3.3 కోట్ల ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేషియా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 66 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్​గ్రేషియా చెల్లించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 66 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ.3.3 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో 103 మంది మృతుల కుటుంబాలకు రూ.5.15 కోట్ల చెల్లింపులు జరిగినట్టు అందులో పేర్కొన్నారు. 2024 –25లో మొత్తం 169 మందికి రూ.8.45 కోట్లు చెల్లించినట్టు అనిల్​ తెలిపారు.