తప్పుడు రిపోర్ట్లతో రెచ్చగొడుతున్నరు.. బీసీలు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు..

తప్పుడు రిపోర్ట్లతో రెచ్చగొడుతున్నరు..  బీసీలు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు..

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన  చేశామన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ . లక్ష మంది ఎన్యూమరేటర్లు కులగణన సర్వే చేశారని చెప్పారు. అధ్యయనం చేసిన తర్వాతే సర్వే చేశారని అన్నారు. శాస్త్రీయ పద్దతిలో సర్వే జరిగిందన్నారు.  కులగణన రిపోర్ట్ ను ప్రతీ బీసీ బిడ్డ స్వాగతించాలన్నారు. 

తెలంగాణలో బీసీలు 56 శాతం  వెనుకబడ్డ తరగతులు ఉన్నాయని సర్వేలో తేలిందన్నారు మహేశ్ కుమార్ గౌడ్. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన..  ఎక్కడా అనుమానాలకు తావు లేదు. మేం 56 శాతం ఉన్నామని  గర్వంగా చెబుతాం.    బీఆర్ఎస్.. బీసీ సంఘాలను రెచ్చగొడుతుంది. బీసీలు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు.  బీసీలకు ఇన్నేండ్లు ఏం చేయలేని నేతలు మమ్మల్ని విమర్శిస్తున్నారు. 

Also Read : తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు

 బీఆర్ఎస్ పదేండ్లు అబద్దాలతో పబ్బం గడుపుకుందని విమర్శించారు.  తప్పుడు రిపోర్ట్ తో  ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.  బీసీ జనాభా తగ్గిందనడానికి మీ దగ్గర ఉన్న శాస్త్రీయ ఆధారం ఏంటి.? . తెలంగాణలో ఇప్పటి వరకు  కులగణనపై ఎలాంటి సర్వే జరగలేదు.  తెలంగాణ చరిత్రలో ఫిబ్రవరి 4న కొత్త అధ్యయనం  మొదలైంది.   దేశ జనాభా లెక్కల్లో కులం కాలం ఎందుకు చేర్చరని ప్రశ్నించారు.

కులగణన సర్వేకు  ఫిబ్రవరి 4న తెలంగాణ అసెంబ్లీ ఆమోదం  తెలిపిన సంగతి తెలిసిందే. కులగణన సర్వే ప్రకారం బీసీలు తెలంగాణలో 56 శాతం ఉన్నారు. అయితే బీసీల సంఖ్యను తక్కువ చేసిచూపించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.