
కేసీఆర్ విమర్శలకు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ సభలో జనం కంటే ఎక్కువ విస్కీ బాటిళ్లే కనిపించాయన్నారు. బీఆర్ఎస్ సభకు మహిళలు ఎవరూ రాలేదన్నారు. తక్కువ కాలంలో ఎక్కువ అవినీతి చేసింది కేసీఆర్ ఫ్యామిలీనే అని చెప్పారు.కేసీఆరే తెలంగాణకు మొదటి విలన్ అని అన్నారు మహేశ్. తెలంగాణను కేసీఆర్ కోలుకోకుండా గట్టి దెబ్బతీశారని ఫైర్ అయ్యారు.
ప్రభుత్వంపై అక్కసుతోనే కేసీఆర్ విమర్శలు చేశారు. సోనియాగాంధీని విమర్శించే స్థాయి కేసీఆర్ కు లేదు. కేసీఆర్ ఒక్కరు పోరాడితే తెలంగాణ రాలేదు. దొంగ పాస్ పోర్టులతో జనాన్ని విదేశాలకు పంపిన విషయం మర్చిపోయావా? కేసీఆర్. గతంలో మీ అంబాసిడర్ కార్లలో డీజిల్ పోసుకునేందుకు డబ్బులు కూడా లేవ్. బీఆర్ఎస్ 420 ఫ్రాడ్స్ చేసిందని విమర్శించారు. టీఆర్ఎస్ నుంచి తెలంగాణను తీసేసిన ఘనుడు కేసీఆర్.
కాళేశ్వరం పేరుతో లక్షా 25వేల కోట్లు గోదార్లో పోసినట్టైంది. గజ్జె కట్టిన గద్దర్ ను ఏ విధంగా అవమానపరిచారో మర్చిపోయావా?. రుణమాఫీపై మేం బహిరంగ చర్చకు సిద్ధం. కుర్చీ ఎక్కకముందు నువ్వు ఎన్ని మాటలు చెప్పావ్. దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైంది. మీ హయాంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో సోయి ఉందా?. ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్, కరీంనగర్ ను లండన్ చేస్తానన్న హామీ ఏమైంది కేసీఆర్ అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్.