- ఇయ్యాల పీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం
- ఏడాది పాలన, కులగణన, లోకల్ బాడీ ఎన్నికలపై చర్చ
హైదరాబాద్, వెలుగు: పీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం గురు వారం గాంధీభవన్లో జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారు. కాంగ్రెస్ ఏడాది ప్రజా పాలన, రాష్ట్రంలో కొనసాగుతున్న కులగణన, దానిపై ప్రజల స్పందన, లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహం, గ్రామస్థాయిలో పార్టీ సంస్థాగత బలోపేతంపై ఈ మీటింగ్లో చర్చించనున్నారు. ఈ నెలాఖరులో ప్రకటించనున్న పీసీసీ కార్యవర్గంపై కూడా ఇందులో చర్చ సాగనుంది.
ఇయ్యాల గాంధీ భవన్లో ముఖాముఖికి భట్టి
గాంధీ భవన్లో గురువారం జరుగనున్న మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన అందుబాటులో ఉండనున్నారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతిపత్రాలను స్వీకరించనున్నారు.