టీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీతోనే రాష్ట్రం అప్పులపాలు

టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీరుపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ప్రభుత్వ దోపిడీతోనే రాష్ట్రం అప్పుల పాలైందని ఆరోపించారు. అవినీతి, కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఊడిగం చేస్తున్న కేసీఆర్.. తెలంగాణ రైతులను పట్టించుకోవడం లేదని అన్నారు. ఫ్రస్టేషన్లో అవాకులు చెవాకులు పేలుతున్న సీఎం.. ప్రధాని మోడీకి క్షమాపణలు చెప్పాలని వివేక్ డిమాండ్ చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ, మోటార్లకు మీటర్లపై ముఖ్యమంత్రి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తానన్న కేసీఆర్ మాట తప్పాడని మండిపడ్డారు.

For more news..

కాంగ్రెస్కు జిరాక్స్ ఆమ్ ఆద్మీ పార్టీ:మోడీ

బర్ద్ డే రోజైనా నోటిఫికేషన్లు ఇస్తే పండగ చేసుకుంటం