ఫోన్ ట్యాపింగ్ కేసులో చంచల్ గూడ జైల్లో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు. జూన్ 3 నుంచి 4వ తేది సాయంత్రం 6 గంటల వరకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాధాకిషన్ రావు తల్లి కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 3న (ఇవాళ) మృతి చెందారు. దీంతో తల్లి మృతిపై అత్యవసర పిటిషన్ దాఖలు వేశారు రాధాకృష్ణన్ రావు. పిటిషన్ ను విచారించిన నాంపల్లి కోర్టు..రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రాధాకిషన్ రావు తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొని రేపు సాయంత్రం జైలులో లొంగిపోనున్నారు.