బ్యాడ్ లక్: IPL మెగా వేలంలో అమ్ముడుపోని తెలంగాణ కుర్రాడు

బ్యాడ్ లక్: IPL మెగా వేలంలో అమ్ముడుపోని తెలంగాణ కుర్రాడు

క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో తెలంగాణ కుర్రాడు అరవెల్లి అవనీష్‎కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఐపీఎల్ వచ్చే సీజన్‎లో ఆడేందుకు రూ.30 లక్షల కనీస ధరతో మెగా వేలంలో పాల్గొన్న అరవెల్లి అవనీష్‎ ను ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయలేదు. అవనీష్‎ను కొనేందుకు ఏ ఫ్రాంఛైజ్ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో తెలంగాణ కుర్రాడు మెగా వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్‎గా నిలిచాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఐపీఎల్‎లో ఆడాలన్న అరవెల్లి అవనీష్‎ కల నేరవేరలేదు. 

కాగా, యువ క్రికెటర్ అరవెల్లి అవనీష్ రావు స్వస్థలం తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామం. చిన్నతనం నుండి క్రికెట్‎పై మక్కువ పెంచుకున్న అవనీష్ అంచెలు అంచెలు ఎదిగి భారత అండర్ 19 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో అవనీష్ రావు పేరు ఒక్కసారిగా మోర్మోగిపోయింది. అండర్ 19 టీమ్‎లో చోటు దక్కించుకున్న తెలంగాణ కుర్రాడు ఐపీఎల్‎లోనూ సత్తా చాటాలనుకున్నాడు. 

ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 మెగా వేలంలో పేరు నమోదు చేసుకోగా.. ఫ్రాంఛైజ్‎లు మాత్రం అవనీష్‎ను కొనుగోలు చేయకపోవడంతో అన్ సోల్డ్ ప్లేయర్‎గా నిలిచిపోయాడు. ఇదే మెగా వేలంలో ఆంధ్రకు చెందిన మరో తెలుగు యువ క్రికెటర్‎ను అదృష్టం వరించింది. తెలుగు ప్లేయర్ షేక్ రషీద్‎ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. రూ.30 లక్షల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన షేక్ రషీద్‎ను సీఎస్కే కనీస ధరకే దక్కించుకుంది.