ఫారెస్ట్ ఆఫీసర్ ఇంట్లో పేకాట..

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పేకాడుతున్న ఓ ఫారెస్ట్​ ఆఫీసర్ ను పోలీసులు అరెస్ట్ ​చేశారు. భద్రాద్రి కొత్తగూడెం ఫారెస్ట్​ డివిజనల్ ​ఆఫీస్​లో ఆకారపు వెంకటేశ్వర్లు టెక్నికల్​అసిస్టెంట్. ఇతడు చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో ఉంటున్నాడు. 

సోమవారం ఇతడి ఇంట్లో పేకాడుతున్నారని సమాచారం రావడంతో రైడ్​  చేయగా వెంకటేశ్వర్లుతో పాటు వ్యాపారులు వట్టిచర్ల శ్రీనివాసరెడ్డి, చక్కా లక్ష్మణ్, ఎన్.మధుకర్, కాంట్రాక్టర్​ ఆకారపు తిరుపతిరావు, సిబ్బంది ధారావత్​ బాలాజీ, సపావత్​ పిచ్చయ్య, కొప్పుల వేణుకుమార్, కొరుబోయిన శ్రీనివాసరావు దొరికారు.