3 గోనె సంచుల్లో 4 వేల పాత మొబైల్ ఫోన్లు.. ఇలా పాత ఫోన్లు అమ్మకండి.. ఎందుకంటే..

3 గోనె సంచుల్లో 4 వేల పాత మొబైల్ ఫోన్లు.. ఇలా పాత ఫోన్లు అమ్మకండి.. ఎందుకంటే..

హైదరాబాద్: పాత మొబైల్ ఫోన్లు కొంటున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 4 వేల పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ల కోసం సైబర్ నేరగాళ్లు పాత ఫోన్లను వాడుతున్నారు. వాడిన మొబైల్ ఫోన్లకు డబ్బులు ఇచ్చి లేదా ప్లాస్టిక్ సామాను ఇచ్చి ఈ ముఠా ఫోన్లు కొంటున్నట్లు తెలిసింది. 3 గోనె సంచుల్లో 4 వేల మొబైల్ ఫోన్లు లభ్యం కావడం గమనార్హం. బీహార్కి చెందిన మహమ్మద్ షమీ, అబ్దుల్ సలాం, మహమ్మద్ ఇఫ్తికర్ గోదావరి ఖని పోలీసులు అరెస్ట్ చేశారు. గోదావరి ఖని పవర్ హౌజ్ కాలనీలో పాత మొబైల్ ఫోన్స్ కొంటుండగా పోలీసులు పట్టుకున్నారు.

తెలంగాణ జిల్లాల్లో గ్రామగ్రామాన మొబైల్ ఫోన్లు కొని బీహార్ మీదుగా.. జామ్ తారా, దేవ్ ఘర్, జార్ఖండ్కు ఈ ముఠా తరలిస్తున్నట్లు తెలిసింది. సైబర్ నేరగాళ్లకు అమ్మే ముందు.. మొబైల్ ఫోన్స్ లో సాప్ట్వేర్ మార్చడం, ఇతర విడి భాగాలు మార్చి.. ఫోన్ పనిచేసేలా మార్చి సైబర్ నేరగాళ్లకు ఈ ముఠా అమ్ముతున్నట్లు పోలీసులు తేల్చారు. గుర్తు తెలియని వ్యక్తులకు మీ పాత ఫోన్లను అమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.