దేశంలోనే మన పోలీసులు బెస్ట్

దేశంలోనే మన పోలీసులు బెస్ట్
  • ఎస్సీఎస్సీ 15వ వార్షికోత్సవంలో హోంమంత్రి మహమూద్ అలీ

మాదాపూర్,వెలుగు: దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసులు బెస్ట్ అని..టెక్నాలజీతో కేసులను ట్రేస్ చేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ)15వ వార్షికోత్సవ వేడుకలు హెచ్ఐసీసీలో జరిగాయి. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి చీఫ్ గెస్ట్ లుగా హాజరయ్యారు.  హోంమంత్రి మాట్లాడుతూ..ఎస్సీఎస్సీ సైబరాబాద్ ఐటీ కారిడార్ లో ఓ విజన్ తో పనిచేస్తోందన్నారు. ఐటీ కారిడార్ లో జాబ్ చేసే విమెన్ ఎంప్లాయీస్ ట్రావెలింగ్ కోసం షీ షటిల్ సర్వీసు, మార్గదర్శక్, సంగమిత్ర లాంటి ప్రోగ్రామ్స్ ను ఎస్సీఎస్సీ చేపట్టడం అభినందనీయమన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్టంలో సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామన్నారు.  రాష్ర్టంలో  మొత్తం 7.5 లక్షల సీసీ కెమెరాలు, సిటీలో 6.5 లక్షల కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటల పాటు నిఘా నీడలో ఉంచామన్నారు. అనంతరం ఎస్సీఎస్సీ వెబ్ సైట్ ను లాంచ్ చేసి సావనీర్ ను ఆవిష్కరించారు.  ఎస్సీఎస్సీ మెంబర్స్ కు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సైయంట్ కంపెనీ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, షీ టీమ్ హెడ్, ఐజీ స్వాతి లక్రా, భారత్ బయోటెక్ జెఎండీ సుచిత్ర ఎల్లా, సైబరాబాద్ సీపీ, ఎస్సీఎస్సీ చైర్మన్ సజ్జనార్,  హైదరాబాద్,రాచకొండ సీపీలు అంజనీకుమార్,  మహేష్​ భగవత్, ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్​, ప్రభాకర్​రెడ్డి,  సందీప్​ శాండిల్యా, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ యేదుల, హైసియా చైర్మన్​ భరణి,  ఎస్సీఎస్సీ మెంబర్స్ పాల్గొన్నారు.