పంజాగుట్టలో ఉన్న ప్రజాభవన్, నాంపల్లి కోర్టుకు వచ్చిన బాంబు బెదిరింపు ఫోన్ కేసులో తెలంగాణ పోలీసులు పురోగతి సాధించారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు పట్టుకొచ్చారు పంజాగుట్ట పోలీసులు. ఫోన్ చేసిన వ్యక్తిని గుంటూరుకు చెందిన శివరామకృష్ణగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో బాంబ్ పెట్టానని.. అది మరికాసేపట్లో పేలుతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి టెన్షన్ క్రియేట్ చేశాడు శివరామకృష్ణ. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో అణువణువు వెతికారు. జల్లెడ పట్టి మరి వెతికారు. ఎక్కడా కూడా ఏమీ దొరకకపోవడంతో ఫేక్ కాల్ అని పోలీసులు గుర్తించారు.
Also read :మూవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. రూ.99కే మల్టీప్లెక్స్ సినిమా టికెట్
ఫోన్ వచ్చిన నెంబర్ ఆధారంగా ట్రెస్ చేయగా ఆ అగంతకుడు రామకృష్ణగా గుర్తించారు. భార్యతో గొడవ పడి మద్యానికి బానిసగా మారిన రామకృష్ణ,... భార్య లేదన్న బాధలో బాంబు బెదిరింపుగా ఫోన్ చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ముషీరాబాద్‌లో ఉంటున్న శివరామకృష్ణను విచారిస్తున్నారు పోలీసులు.