పెద్ద మనస్సు చాటుకున్న తెలంగాణ పోలీసులు.. సీఎం రిలీఫ్ ఫండ్‎కు భారీ విరాళం

పెద్ద మనస్సు చాటుకున్న తెలంగాణ పోలీసులు.. సీఎం రిలీఫ్ ఫండ్‎కు భారీ విరాళం

తెలంగాణ పోలీసులు మరోసారి పెద్ద మనస్సు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలిచే పోలీసులు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో సర్వస్వం కోల్పోయిన బాధితులను అదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు వరద బాధితులకు ఒక్క రోజు మూల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. వన్డే శాలరీ రూ.11 కోట్ల ,06,83,571 చెక్‎ను డీజీపీ జితేందర్, ఇతర పోలీసులు  అధికారులు ఇవాళ (సెప్టెంబర్ 11) సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన పోలీసులను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. 

కాగా, ఇటీవల ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రా్ల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే, వర్షాలు, వరదలతో ప్రజలు కకావికలం అయ్యారు.  వరద వల్ల పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. వేల మంది సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిపోయారు. వర్షాలు, వరదలకు అన్నీ కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు ముందుకు వచ్చారు. వరద బాధితుల కోసం భారీగా విరాళాలు ప్రకటించారు. ఈ క్రమంలోనే వరద బాధితుల కష్టాలను చూసి చెలిపోయించిన తెలంగాణ పోలీసులు సైతం తమ ఒక్క రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. 

Also read:-హైదరాబాద్ సిటీలో రేవ్ పార్టీ