రెంట్ అని తీసుకెళ్లి ఇలా చేస్తారా..? వైసీపీ నేతల ఆధీనంలోని కార్లను విడిపించిన తెలంగాణ పోలీసులు

రెంట్ అని తీసుకెళ్లి ఇలా చేస్తారా..? వైసీపీ నేతల ఆధీనంలోని కార్లను విడిపించిన తెలంగాణ పోలీసులు

వైసీపీ నేతల ఆధీనంలో ఉన్న తెలంగాణకు చెందిన వ్యక్తి కార్లను తెలంగాణ స్టేట్ పోలీసులు విడిపించారు. తిరిగి కార్లను బాధితుడికి అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం.. తెలంగాణ సంగారెడ్డికి చెందిన సతీష్ కుమార్ వద్ద నుండి ఏపీలోని పులివెందుల మెడికల్ కాలేజీ కోసమని చెప్పి ఆరు కార్లను వైసీపీ నేతలు 2021లో  రెంటల్ కాంట్రాక్ట్‌పై తీసుకెళ్లారు. ఆ కార్లను తీసుకెళ్లిన వైసీపీ నేతల ఆచూకీ సతీష్ కుమార్‌కు లభించలేదు. దీంతో జీపీఎస్ ట్రాక్ చేసి చూడగా కార్లు వేంపల్లెలో ఉన్నట్లుగా గుర్తించాడు. అక్కడకు వెళ్ళి తన కార్లను ఇచ్చేయాలని అడగగా.. ఇడుపులపాయలో తనను బంధించి కొట్టారని సతీశ్ కుమార్ ఆరోపించాడు. 

ఈ మేరకు 2021లో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో సతీష్ ఫిర్యాదును పోలీసులు లైట్ తీసుకున్నారు. అయితే.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసులో కదలిక వచ్చింది. కడప పోలీసుల సాయంతో తెలంగాణ పోలీసులు నాలుగు రోజుల పాటు పులివెందుల, వేంపల్లెలో గాలించి.. సతీష్ కుమార్ కార్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని సతీష్ కుమార్‌కు అప్పగించారు.