ఆర్మీకోసం విరాళాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు..తెలంగాణ పోలీస్ కీలక ప్రకటన

ఆర్మీకోసం విరాళాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు..తెలంగాణ పోలీస్ కీలక ప్రకటన

హైదరాబాద్: ఆర్మీ ఆధునీకరణకు విరాళాలు ఇవ్వాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. సైనిక సహాయ నిధికి డొనేషన్స్ పేరిట ఫేక్ వెబ్ సైట్లు క్రియేట్ చేశారు.వాట్సాప్ , టెలిగ్రామ్, ఫేస్ బుక్, లింక్స్ షేర్ చేస్తూ డబ్బులు అడుగుతున్నారు. ప్రజల దేశభక్తిని ఆసరాగా చేసుకొని మేసేజ్ పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే దీనిని తెలంగాణ పోలీసు హెచ్చరికలు జారీ చేసింది. 

ఇండియా ఆర్మీ కోసం విరాళాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలంగాణ పోలీసులు తెలిపారు. ఇండియన్ ఆర్మీ కోసం ఎలాంటి విరాళాలు సేకరించడం లేదు..ఇలాంటి లింక్స్ కనిపిస్తే తక్షణమే రిపోర్టు చేయాలని కోరారు. ఇలాంటి ఫేక్ మేసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు అలెర్ట్ చేశారు. 

►ALSO READ | మిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ ఆదేశం

‘‘ప్రజల దేశభక్తిని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు సైబర్‌ నేరగాళ్లు. ఇండియన్ ఆర్మీ ఆధునీకరణకోసంవిరాళాల సేకరణ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి సమాచారం మీ దృష్టికి వస్తే రిపోర్ట్ చేయాలి. ఇలంటి మేసేజ్ లను ఫార్వార్డ్ చేయొద్దని ఫేక్‌  సమాచారంపై అవగాహన కల్పించాలని ’’ తెలంగాణ పోలీస్ శాఖ Xలో పోస్టును షేర్ చేసింది.