81,315 మంది పోలీసులకు భద్రత స్కీమ్‌‌‌‌ : డీజీపీ జితేందర్‌‌‌‌ 

81,315 మంది పోలీసులకు భద్రత స్కీమ్‌‌‌‌ : డీజీపీ జితేందర్‌‌‌‌ 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పోలీస్‌‌‌‌ విభాగంలో భద్రత స్కీమ్‌‌‌‌ అమలుపై డీజీపీ జితేందర్‌‌‌‌ మంగళవారం సమీక్షించారు. అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌కు అందుతున్న సేవలపై ఆరా తీశారు. భద్రత సంస్థ చైర్మన్‌‌‌‌గా వార్షిక ఖాతాలకు ఆమోదం తెలిపారు. తర్వాత డీజీపీ మాట్లాడుతూ.. సొసైటీస్ చట్టం కింద స్థాపించబడిన భద్రత పథకంలో ప్రస్తుతం 81,315 మంది పోలీసు సిబ్బంది, మినిస్టీరియల్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ ఉన్నారని చెప్పారు.

ఈ పథకం పోలీసు సిబ్బందికి సామాజిక భద్రత, ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. గృహ నిర్మాణ రుణాలు, విద్యా రుణాలు, కుమార్తెల వివాహాలకు ఆర్థిక సహాయం వంటి వివిధ ప్రయోజనాలను అందిస్తుందని వెల్లడించారు.