నర్సింహులపేటలో 20క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

నర్సింహులపేటలో 20క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

నర్సింహులపేట, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం వంతడపల స్టేజి వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 20క్వింటాళ్ల నల్ల బెల్లాన్ని పోలీసులు పట్టుకున్నారు. వంతడపల స్టేజి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అశోక లెల్యాండ్ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో పోలీసులు వెహికిల్ చెక్ చేయగా ఉనక బస్తాల కింద బెల్లం బస్తాలు కనిపించాయి .

వెహికిల్ తో పాటు మరిపెడ మండలం నేతవత్ తండాకు చెందిన నేతవత్ వెంకటేశ్​, సన్నూరుకు  చెందిన  వెంకన్న పై కేసు నమోదు చేశారు.  వీరు ఏపీ  నుంచి బెల్లం తీసుకువచ్చి శివారు తండాల్లో అమ్ముతున్నారని ,పట్టుబడిన బెల్లం విలువ 2 లక్షలు ఉంటుందని ఎస్సై గుండ్రతి సతీశ్ చెప్పారు.