ఫేక్ న్యూస్ ప్రచారం: స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు

ఫేక్ న్యూస్ ప్రచారం: స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు

ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు.  హెచ్సీయూలో AI చిత్రాన్ని  IAS అధికారిణి స్మితా సబర్వాల్ తన ఎక్స్  X లో రీ ట్వీట్ చేయడమే ఇందుకు కారణం. మార్చి 31న    హాయ్ హైదరాబాద్ అనే X హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన ఓ ఇమేజ్ ను స్మితా సబర్వాల్ రీ పోస్ట్ చేశారు.   హెచ్ సీయూ లోపల మష్రూమ్ రాక్ ముందు భారీగా బుల్డోజర్లు వాటి ముందు జింక, నెమలి గిబ్లి శైలిలో ఉంది. ఈ పోస్ట్ ను స్మితా సబర్వాల్ తన ఎక్స్ లో  రీ పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించి ఆమెకు నోటీసులిచ్చారు. 

కంచగచ్చిబౌలి భూములపై గత కొన్ని రోజులు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.. చాలా మంది ఈ వివాదంపై సోషల్ మీడియాలో ఏఐతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 400 ఎకరాల భూముల్లో భారీగా బుల్డోజర్లు జింకలను, నెమల్లను తరిమేస్తున్నట్లు ఫోటోలు,వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం ఫేక్ వీడియోలు,ఫోటోలతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై నిఘా పెట్టింది.ఫేక్ న్యూ్స్ ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటోంది.

ఈ క్రమంలోనే ఫేక్ న్యూ్స్ ప్రచారం చేసిన స్మితా సబర్వాల్ కు బీఎన్ఎస్ సెక్షన్ 179కింద  నోటీసులిచ్చినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. తనకు నోటీసులివ్వడంపై స్మితా సబర్వాల్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఉత్కంఠగా ఉంది.