తనిఖీల్లో పట్టుబడ్డ రూ. కోటీ యాభై లక్షలు

తనిఖీల్లో పట్టుబడ్డ రూ. కోటీ యాభై లక్షలు

మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా  సోదాలు చేపడుతున్నారు.  ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు, మద్యం తరలించే అవకాశం ఉండటంతో ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా ఈ రోజు సాయంత్రం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ చెక్ పోస్టులో ఓ కారులో జరిపిన సోదాల్లో పోలీసులు రూ. 1.50 కోట్లు పట్టుకున్నారు. ఈ డబ్బును తాండూర్ కు తరలిస్తున్నట్లుగా వారు గుర్తించారు. అనంతరం ఆ నగదు స్వాధీనం చేసుకొని, కార్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.