నేరస్తుడు లక్షల మందిలో ఉన్నా సెకన్‌‌‌‌లో పట్టేస్తరు.. మారువేశాల్లో తిరిగినా.. పట్టుకునే ఫేస్ ఫ్యాక్ట్

నేరస్తుడు లక్షల మందిలో ఉన్నా సెకన్‌‌‌‌లో పట్టేస్తరు.. మారువేశాల్లో తిరిగినా.. పట్టుకునే ఫేస్ ఫ్యాక్ట్
  • ఫేస్ ఫ్యాక్ట్‌‌‌‌, ఫేస్ రికగ్నేషన్  సిస్టమ్ తో  క్యాప్చర్
  • సైబర్ సెక్యూరిటీ సెంటర్‌‌‌‌‌‌‌‌లో రెడీ అవుతున్న కొత్త టెక్నాలజీ
  • వందల సీసీటీవీ కెమెరాల ఫుటేజీ సెకన్లలోనే స్కానింగ్
  • రూపురేఖలను మార్చినా గుర్తుపట్టే సాంకేతికత


హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సైబర్  సెక్యూరిటీ బ్యూరో  కేంద్రంగా మరో కొత్త టెక్నాలజీ రూపొందుతోంది. పోలీసు రికార్డుల్లో ఉన్న నేరస్తుల  కదలికలను గుర్తించేందుకు ఫేస్‌‌‌‌  ఫ్యాక్ట్‌‌‌‌  ఫేస్‌‌‌‌  రికగ్నషన్  సిస్టమ్‌‌‌‌  అందుబాటులోకి రానుంది. మనిషి ముఖంపై ఉన్న 15 రకాల ప్యాచులను స్కాన్  చేసి క్రిమినల్స్‌‌‌‌ను క్యాప్చర్‌‌‌‌‌‌‌‌  చేసే టెక్నాలజీని అధికారులు డెవలప్  చేస్తున్నారు. రానున్న రోజుల్లో పోలీస్‌‌‌‌  డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఇది కీలకంగా మారనుంది.

ఇందుకు సంబంధించి ఆర్టిఫిషియల్‌‌‌‌  ఇంటెలిజెన్స్‌‌‌‌  తరహాలో అత్యాధునిక సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌, టూల్స్‌‌‌‌ను స్టార్టప్  కంపెనీలు ఇప్పటికే  అభివృద్ధి చేశాయి. ఇలాంటిదే స్మార్ట్‌‌‌‌  మెట్రిక్‌‌‌‌  టెక్నాలజీస్‌‌‌‌  రూపొందించిన ఫేస్‌‌‌‌ ఫ్యాక్ట్‌‌‌‌  సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ను షీల్డ్‌‌‌‌–2025లో ప్రదర్శించారు. ఈ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ను సైబర్  సెక్యూరిటీ బ్యూరో, ఐటీ అధికారులు పరిశీలించనున్నారు. త్వరలోనే ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు.  నాంపల్లి, సికింద్రాబాద్  రైల్వే స్టేషన్లతో పాటు ఎంజీబీఎస్‌‌‌‌, జేబీఎస్‌‌‌‌  బస్టాండ్లలోని సీసీటీవీ కెమెరాలకు ఫేస్‌‌‌‌  ఫ్యాక్ట్‌‌‌‌  సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ను అనుసంధానం చేయనున్నారు.

క్రిమినల్స్  డేటా బేస్‌‌‌‌తో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ లో సెర్చింగ్‌‌‌‌ ఇలా..

నేరం జరిగినప్పుడు పోలీసులు ఆధారాలు సేకరిస్తుంటారు. ప్రధానంగా అనుమానితులు, నిందితులు, దోషులు కేటగిరీలుగా డేటా రూపొందిస్తుంటారు. ఇందులో నేరం జరిగిన తీరు, కేసుల్లో అరెస్టయిన నిందితుల ఫొటోలు, ఫింగర్‌‌‌‌‌‌‌‌ ప్రింట్లతో డేటా తయారు చేస్తుంటారు. వీటిని టీజీ పోలీస్  కాప్‌‌‌‌  యాప్‌‌‌‌తో పాటు క్రైం అండ్‌‌‌‌  క్రిమినల్‌‌‌‌  ట్రాకింగ్‌‌‌‌  నెట్‌‌‌‌వర్క్‌‌‌‌  అండ్‌‌‌‌  సిస్టమ్‌‌‌‌ (సీసీటీఎన్‌‌‌‌ఎస్‌‌‌‌) తో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసులకు అందుబాటులో పెడుతున్నారు.

ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన క్రిమినల్స్  డేటాబేస్  మన రాష్ట్ర పోలీసులకు కూడా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అందుబాటులో ఉంది. తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు, నేరం చేసినం విధానం ఆధారంగా నిందితులను ఈ డేటాబేస్ తో గుర్తించవచ్చు. దీనికి ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ తోడయ్యింది. ముఖాన్ని చూసి పట్టేలా సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ ను నిపుణులు డెవలప్‌‌‌‌  చేశారు. 

15 రకాల ఫేస్ ప్యాచులు మ్యాచ్‌‌‌‌ చేసి అలారం..

రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, పబ్లిక్  ప్లేసెస్‌‌‌‌లో హై డెఫినేషన్‌‌‌‌  సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్  అండ్‌‌‌‌  కంట్రోల్‌‌‌‌  సెంటర్‌‌‌‌‌‌‌‌కు  ఫేషియల్  రికగ్నేషన్  ల్యాబ్‌‌‌‌కి కనెక్ట్  చేశారు. క్యాప్చర్‌‌‌‌‌‌‌‌  చేసిన అనుమానితుల ఫొటోలను క్రైం రికార్డుల్లోని పాత నేరస్తుల డేటాతో  ఫేస్ ఫ్యాక్ట్‌‌‌‌  స్కాన్‌‌‌‌  చేస్తుంది. ఫేషియల్  రికగ్నేషన్‌‌‌‌  టూల్‌‌‌‌ ‌‌‌‌ ఆ డేటాను పరిశీలిస్తుంది. కళ్లు, కనుబొమ్మలు, పెదాలు, ముక్కు సహా ముఖంపై కనిపించే మొత్తం 15 రకాల ప్యాచెస్‌‌‌‌లో ఏ ఒక్కటి మ్యాచ్‌‌‌‌  అయినా కంట్రోల్‌‌‌‌  రూమ్‌‌‌‌లో అలారం మోగుతుంది.

ఇలా డేటాబేస్‌‌‌‌లోని ఫొటోలతో పోలికలు కలిగిన వారు లక్షల మందిలో ఎక్కడున్నా గుర్తించి పట్టిస్తుంది. వీటిని టీజీ కాప్‌‌‌‌  అనుమానితుల  డేటాలో అప్‌‌‌‌లోడ్‌‌‌‌  చేస్తారు. అనుమానితులు ఎక్కడికెళ్లినా ట్రేస్‌‌‌‌  చేసేలా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించవచ్చు.

హైదరాబాద్‌‌‌‌లో అడుగు పెడితే క్యాప్చర్ చేసేలా.. 

దేశవ్యాప్తంగా 25 వేల మందికి పైగా నేరస్తుల డేటా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో అంతర్రాష్ట్ర ముఠాలు, మోస్ట్‌‌‌‌ వాంటెడ్‌‌‌‌  క్రిమినల్స్‌‌‌‌, టెర్రరిస్టులకు చెందిన డిజిటల్  రికార్డులు ఉన్నాయి. ఈ డేటాను సీసీటీవీ కెమెరాలు, సైబర్  ఫ్యూజన్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌తో అనుసంధానం చేశారు. ఇప్పటికే కమాండ్‌‌‌‌  అండ్‌‌‌‌  కంట్రోల్‌‌‌‌  సెంటర్‌‌‌‌‌‌‌‌కు కనెక్ట్‌‌‌‌ అయిన సీసీటీవీ కెమెరాల ద్వారా ఫొటోలను స్కాన్  చేస్తున్నారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంతర్రాష్ట క్రిమినల్స్‌‌‌‌పై నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే అధునాత ఫేస్‌‌‌‌  ఫ్యాక్ట్‌‌‌‌  ఫేషియల్‌‌‌‌  రికగ్నిషన్‌‌‌‌  సిస్టమ్‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ను కూడా సీసీటీవీ కెమెరాలకు కనెక్ట్‌‌‌‌  చేయనున్నారు.  

మారువేశాల్లో తిరిగినా.. పట్టుకునే ఫేస్ ఫ్యాక్ట్ 

ఫేస్ ఫ్యాక్ట్‌‌‌‌ అనేది డీప్ న్యూరల్ నెట్ వర్క్ (డీఎన్‌‌‌‌ఎన్)తో పనిచేస్తుంది. సీసీటీవీ కెమెరాల్లో ఎన్ని లక్షల ముఖాలు కనిపించినా నేరస్తుల ముఖాన్ని సెకన్ల వ్యవధిలో క్యాప్చర్  చేయగలదు. పోలీసు రికార్డుల్లో ఉన్నవారు మారువేశాల్లో తిరిగినా ఫేస్  ఫ్యాక్ట్  టెక్నాలజీ సాయంతో పట్టుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఫేస్ ఫ్యాక్ట్‌‌‌‌  చెప్పేస్తుంది. 2016లో సికింద్రాబాద్‌‌‌‌  రైల్వే స్టేషన్‌‌‌‌లో ఫేస్ రికగ్నిషన్‌‌‌‌  ఏర్పాటు చేశాము. దీన్ని ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా డెవలప్  చేశాము.  - విక్రమ్‌‌‌‌