క్రిస్మ‌స్ గ్రీటింగ్స్ పేరిట సైబ‌ర్ మోసాలు.. క్లిక్ చేస్తే డబ్బులు మాయం

క్రిస్మ‌స్ పండగ నేపథ్యంలో 'మెర్రీ క్రిస్మస్', 'మీరు మా ప్రియమైన కస్టమర్.. ఈ గిఫ్ట్ మీకోసమే..' అంటూ అపరిచిత వ్యక్తుల నుంచి మీకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయా..! అయితే మీరు అప్రమత్తంగా ఉండాల్సిందే. క్రిస్మస్ గ్రీటింగ్స్, మెసేజీల పేరిట సైబర్ నేరగాళ్లు కొత్త త‌రహా సైబ‌ర్ మోసాలకు పాల్పడనున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

మీ కోసం కిస్మస్ గిఫ్ట్.. అంటూ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే సందేశాలను పట్టించుకోవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. అత్యాశతో లింక్‌పై క్లిక్ చేస్తే.. ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యి వ్యక్తిగత డేటా చోరీ చేస్తారని హెచ్చరిస్తున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు సైబర్ మోసగాళ్లు ఎంచుకున్న కొత్త స్కెచ్ ఇదని పోలీస్ పెద్దలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కావున, క్రిస్మ‌స్ శుభాకాంక్షల పేరిట వచ్చే లింక్స్ క్లిక్ చేసి.. డబ్బులు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు.

అంతేకాదు, క్రిస్మస్ అంటేనే కేక్స్.. కేక్ ఆర్డర్లు మస్త్ గా ఉంటాయి.. దీన్ని కూడా సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. క్రిస్మస్ కేక్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ.. రెండు కేక్స్ ఆర్డర్ చేస్తే మూడు కేక్స్ ఫ్రీ అంటూ మోసం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అదే విధంగా క్రిస్మస్ డ్రస్సుల పేరుతో కూడా షాపింగ్ లింక్స్ వస్తున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 70 పర్సంట్.. 80 పర్సంట్ ఆఫర్స్ తో క్రిస్మస్ షాపింగ్ పేరుతో లింక్స్ వస్తున్నాయని.. అలాంటి సైట్స్ ఓపెన్ చేసి షాపింగ్ చేస్తే ప్రమాదం అందని ప్రజలను హెచ్చరిస్తున్నారు పోలీసులు.

ALSO READ | సైన్ బోర్డులతో రోడ్లపై తిరుగుతున్న కూలీలు : మనుషులు.. మనుషుల్లా కనిపించటం లేదా..!

ఎవరైనా సైబర్ నేరాల భారిన పడితే తక్షణమే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.